నాన్నమ్మను కలవాలనుకుంటే...జీవితం తగలబడిపోయింది

November 16, 2019


img

ఖమ్మం జిల్లా మణుగూరులో ఉంటున్న ఒక బాలిక దుమ్ముగూడెం మండలంలో గంగోలు గ్రామంలో ఉంటున్న నాయనమ్మను చూసి వచ్చేందుకు బయలుదేరితే ఆ ప్రయాణం ఆమె జీవితంలో భయనకమైన చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

మణుగూరు డీఎస్పీ బి.రామాంజనేయులు చెప్పిన దాని ప్రకారం, ఆ బాలిక సీతారామపురంలోని తన తల్లికి పరిచయస్తుడైన కళ్యాణ్ అనే వ్యక్తికి తాను భద్రాచలం వస్తున్నానని, తనను బండిపై నాన్నమ్మ ఇంటి వద్ద దిగబెట్టవలసిందిగా కోరుతూ మెసేజ్ పెట్టి, నవంబర్ 27 ఉదయం అక్కడకు బస్సులో చేరుకొంది. 

అయితే కళ్యాణ్ ఆమెను నానమ్మ ఇంటికి తీసుకువెళ్లకుండా తన రూమ్‌కు తీసుకువెళ్లి పెళ్ళి చేసుకొందామంటూ మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. మరుసటిరోజు ఉదయం ఆమెను భద్రాచలం బస్టాండులో విడిచిపెట్టాడు. ఆమె బస్సులో మణుగూరు చేరుకొని అక్కడి నుంచి ఆటోలో గంగోలుకు బయలుదేరింది. 

కానీ ఆమె అమాయకత్వాన్ని గమనించిన ఆటో డ్రైవర్ ముత్తారపు వెంకటేష్ కూడా ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న సీతారామాపురానికి చెందిన పోడియం సాయి, తెల్లం కృష్ణ, అంతోటి ప్రశాంత్, వినయ్, సోడే రాంబాబు అనే ఐదుగురు యువకులు అక్కడకు చేరుకొని ఆటో డ్రైవరును చితకబాది, ఆ తరువాత ఒకరి తరువాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు. 

అనంతరం అదే ఆటోలో ఆమె మణుగూరు గుట్ట మల్లారం చేరుకొంది. అక్కడి నుంచి అదే ఆటో డ్రైవర్ సాయంతో ఆమె మరుసటి రోజు ఉదయం మళ్ళీ కళ్యాణ్ వద్దకు చేరుకొని అతనితో జరిగిన విషయాలను మొరపెట్టుకొంది. ఇదే అదునుగా అతను మళ్ళీ మరోమారు ఆమెపై అత్యాచారం చేశాడు. 

ఆ తరువాత ఆమెను తన బైక్ పై ఎక్కించుకొని గంగోలులో విడిచిపెట్టాడు. కానీ అక్కడ నాన్నమ్మ లేకపోవడంతో ఆమె మళ్ళీ భద్రాచలం తిరిగి వచ్చి కల్యాణ్‌కు ఫోన్‌ చేయగా అతను, ఆమె తల్లితండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆమెను తీసుకువెళ్ళారు. 

జరిగిందంతా ఆమె తల్లితండ్రులకు చెప్పడంతో వారు భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారిలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారిపై మైనర్ బాలికపై అత్యాచార నేరం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. 


Related Post