ఆరుగురు తెరాస ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

November 16, 2019


img

ఆరుగురు తెరాస ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ శుక్రవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆరుగురు తెరాస ఎమ్మెల్యేలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. నన్నపునేని నరేందర్‌ (వరంగల్‌-తూర్పు), ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), మెతుకు ఆనంద్‌ (వికారాబాద్), పట్నం నరేందర్ రెడ్డి (కొడంగల్), కె.మహేశ్ రెడ్డి (పరిగి), మైనంపల్లి హనుమంతరావు (మల్కాజిగిరి) ఎమ్మెల్యేలను నాలుగు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని కేసును అప్పటికి వాయిదా వేసింది. ఈ కేసులకు సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.  Related Post