ఇక టోల్ గేట్స్ వద్ద ఆగక్కరలేదు

November 15, 2019


img

టోల్ గేట్స్ వద్ద ఆగి టోల్ ఫీజ్ చెల్లించడం ఎంత కష్టమో రోజూ వాటి గుండా ప్రయాణించేవారికి బాగా తెలుసు. ఇక పండుగలు పబ్బాలు వస్తే టోల్ గేట్ల వద్ద నరకమే. ఈ సమస్యల నుంచి వాహనదారులకు విముక్తి కల్పించడానికి కేంద్రప్రభుత్వం డిసెంబర్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్ల వద్ద ‘ఫాస్ట్ టాగ్’ అనే కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురాబోతోంది. 

ఇది ఎలా పనిచేస్తుందంటే... టోల్ గేట్లవద్ద, బ్యాంకులలో, ఆన్‌లైన్‌లో అమెజాన్, పేటిఎమ్‌ సంస్థలలోనూ ఈ ‘ఫాస్ట్ ట్యాగ్’లు కొనుగోలు చేయవచ్చు. వాటిని వాహనాల ముందువైపు అద్దంపై అంటించుకోవలసి ఉంటుంది. ఫాస్ట్-ట్యాగ్ ఉన్న వాహనం టోల్ గెట్ వద్దకు చేరుకొన్నప్పుడు అక్కడ అమర్చబడిన స్కానర్ ఫాస్ట్-ట్యాగ్‌ను స్కాన్ చేసి టోల్ గెట్ రుసుమును కట్ చేసుకొంటుంది. ఈ విధానంలో టోల్ గేట్ల వద్ద డబ్బు చెల్లించనవసరం ఉండదు కనుక అక్కడ ఆగకుండా ముందుకు సాగిపోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు ఫాస్ట్-ట్యాగ్‌ను రీ-చార్జ్ చేయించుకోవలసి ఉంటుంది. 

ఈ కొత్త విధానం అమలుచేయడానికి కేంద్రప్రభుత్వం దేశంలో దాదాపు అన్ని టోల్ గేట్ల అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసింది. అలాగే వాహనదారులకు మీడియా ద్వారా ఈ ఫాస్ట్-ట్యాగ్‌ వినియోగంపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తోంది. వాహనదారులందరూ ఈ కొత్త విధానంలోకి మారేందుకు కొంత సమయం ఇచ్చేందుకు వీలుగా మరికొన్ని రోజులు నగదు రూపంలో టోల్ గెట్ ఫీజు చెల్లింపులకు అనుమతిస్తోంది. కానీ రెట్టింపు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. తద్వారా వాహనదారులు వీలైనంత త్వరగా ఫాస్ట్-ట్యాగ్‌ విధానంలో మారుతారని కేంద్రప్రభుత్వం ఆశిస్తోంది.


Related Post