టీఆర్టీ-ఉర్దూ పోస్టుల భర్తీకి కసరత్తు షురూ

November 15, 2019


img

తెలంగాణలో ఉర్దూ మీడియం పాఠశాలలో ఉర్దూ భోధించే ఉపాధ్యాయుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. దీనికోసం జిల్లాల వారీగా ఉర్దూ మీడియం పాఠశాలలో ఖాళీల వివరాలను సేకరిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ పోస్టుల భర్తీపై సిఎం కేసీఆర్‌ త్వరలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని మంత్రి సబితా రెడ్డి  తెలిపారు. డిసెంబరు నెలాఖరులోగా  టీఆర్టీ-ఉర్దూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. 

తెలంగాణ ప్రభుత్వం టీఆర్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసి పరీక్షలు, ఇంటర్వ్యూలు అన్ని నిర్వహిస్తోంది కానీ అర్హత సాధించిన వారికి నియామక పత్రాలను అందజేసి ఉద్యోగాలలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. ఆ కారణంగా అర్హత సాధించిన టీఆర్టీ అభ్యర్ధులు వారి కుటుంబాలు కలిసి అనేకసార్లు ప్రగతి భవన్‌ ఎదుట ధర్నాలు చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక టీఆర్టీ-ఉర్దూ పోస్టుల భర్తీలో ఆవిధంగా ఆలస్యం జరుగకుండా విద్యాశాఖ ముందు జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.


Related Post