విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం

October 19, 2019


img

ఒక పక్క ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రం అట్టుడుకిపోతుంటే రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు కూడా కొన్ని డిమాండ్లతో సమ్మెకు సిద్దమయ్యారు. కానీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌ విద్యుత్ సౌధాలో విద్యుత్ సంస్థల సిఎండీలు, ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు ఫలవంతం అవడంతో వారు సమ్మెను వాయిదా వేసినట్లు ప్రకటించారు. తమ డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. త్వరలోనే మళ్ళీ మరోసారి అధికారులతో సమావేశమవుతామని, ఆలోగా వారు తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తెలియజేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. Related Post