ఆర్టీసీకి మద్దతుగా నల్గొండలో టీఎన్జీవోలు బైక్ ర్యాలీ

October 17, 2019


img

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వాలని టీఎన్జీవో సమావేశంలో నిర్ణయించినందున ఈరోజు ఉదయం నల్గొండ పట్టణంలో ఆర్టీసీ డిపో వద్దకు టీఎన్జీవోలు, ఉపాద్యాయ జేఏసీ నేతలు తరలివచ్చి అక్కడ ఆర్టీసీ కార్మికులతో కలిసి కాసేపు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంలో తాము అండగా నిలుస్తామని, దానిలో భాగంగా ఈనెల 19న జరిగే తెలంగాణ బంద్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నామని టీఎన్జీవో నేత శ్రవణ్ కుమార్ తెలిపారు. 

ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ ఒంటరిపోరాటం చేస్తున్నారు. ఇప్పుడు టీఎన్జీవోలు, ఉపాధ్యాయసంఘాలు కూడా వారికి మద్దతు ప్రకటించినందున సమ్మె మరింత ఉదృతమయ్యే అవకాశం ఉంది. సమ్మె విషయంలో హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసి శుక్రవారం వరకు గడువు విధించింది. కానీ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని సిఎం కేసీఆర్‌ స్పష్టం కనుక ప్రభుత్వంపై అన్ని వైపులా నుంచి ఒత్తిడి పెరగడం ఖాయం. ఈ అవాంఛనీయ పరిణామాలు చివరికి ఎటు దారి తీస్తాయో? చివరికి ఎవరు బలవుతారో?రానున్న రోజులలో తెలుస్తుంది.


Related Post