సచివాలయం కూల్చివేత కేసుపై హైకోర్టు విచారణ

October 16, 2019


img

తెలంగాణ సచివాలయం కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది సచివాలయం కూల్చివేయాలనే నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు. సచివాలయం కూల్చివేయడానికి టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికను హైకోర్టుకు సమర్పించారు. సచివాలయం అనేక బ్లాకులు శిధిలావస్థకు చేరుకున్నాయని,  కనుక కొన్నిటిని తొలగించి మరికొన్నిటిని యధాతధంగా ఉంచడం సరికాదని వాదించారు. అయినా ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాలలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని, సచివాలయం నిర్మాణ వ్యవహారం ప్రభుత్వ విచక్షణకే విడిచిపెట్టాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ఈ కేసును ఈనెల 21కి వాయిదా వేసింది. 



Related Post