అయోధ్య కేసు నేటితో ముగింపు?

October 16, 2019


img

అయోధ్య-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంకోర్టులో నేడు తుది విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నవంబర్ 17న విరమణ చేయనున్నందున, అత్యంత సంక్లిష్టమైన సున్నితమైన ఈ కేసుపై నేటితో విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించి పదవీ విరమణ చేయాలని భావిస్తున్నారు. కనుక ఈరోజు సాయంత్రం 5 గంటలలోపుగా ఇరుపక్షాలు తమతమ వాదనలు పూర్తిచేయాలని జస్టిస్ రంజన్ గగోయ్ విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టులో  ఈ కేసు విచరణ తుది దశకు చేరుకోవడంతో అయోధ్య పట్టణంలో కర్ఫ్యూ విధించి భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఒకవేళ ఇరుపక్షాలు పట్టువిడుపులు ప్రదర్శించి రాజీకి సిద్దపడితే దశాబ్ధాలుగా సలుపుతున్న ఈ సమస్య త్వరలోనే పరిష్కారంఅవుతుంది. అయితే ఈ వివాదంలో హిందూముస్లింల భావోద్వేగాలు, ఆ వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మతపెద్దల పంతాలు, వివిదపార్టీల రాజకీయ ప్రయోజనాలు ఇంకా అనేక అంశాలు ఇమిడి ఉన్నందున తుది తీర్పు వెలువడే అవకాశం తక్కువేనని భావించవచ్చు. ఒకవేళ ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా తీర్పు వెలువడితే మాత్రం అది చారిత్రాత్మకమైన తీర్పే అవుతుంది.


Related Post