రూ.2,000 ముద్రించడం లేదట!

October 16, 2019


img

దేశంలో నల్లధనం అరికట్టేందుకు 2016 నవంబరులో ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ రూ.2,000 ప్రవేశపెట్టి నల్లధనం నిలువచేసుకోవడానికి ఇంకా వెసులుబాటు కల్పించినందుకు తీవ్ర విమర్శల పాలయ్యారు. అప్పటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోట్లను ముద్రిస్తూనే ఉన్నప్పటికీ అవి మార్కెట్లలో కనిపించడం లేదు. అంటే అవన్నీ మళ్ళీ నల్లధనంగా మారిపోతున్నాయన్న మాట!

కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి ముద్రణను ఏటా క్రమంగా తగ్గిస్తూ 2019 ఆర్ధిక సంవత్సరంలో పూర్తిగా నిలిపివేసింది. సమాచార హక్కు క్రింద ఒక మీడియా సంస్థ రూ.2,000 ముద్రణ గురించి అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో 2017లో 3,542.991 మిలియన్ (ఒక మిలియన్=10 లక్షలు) నోట్లను, 2018లో 111.507 మిలియన్ నాట్లను, 2019లో 46.690 మిలియన్ నోట్లను ముద్రించినట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒక్క నోటు కూడా ముద్రించలేదని తెలియజేసింది. కనుక ప్రస్తుతం మార్కెట్లలో చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు మాత్రమే ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కనుక వాటితో మళ్ళీ నల్లధనం పోగేసుకొంటున్నవారు మళ్ళీ ఏదో ఓ రోజున నిండా మునిగే ప్రమాదం కనబడుతోంది.


Related Post