సికింద్రాబాద్‌కు త్వరలో కొత్త రైలు

October 15, 2019


img

సికింద్రాబాద్‌కు త్వరలో కొత్త రైలు వస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌-చెన్నై మద్య చెన్నై ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఉంది. త్వరలో గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ మీదుగా చెన్నైకు మరో రైలు ప్రారంభం కాబోతోంది. మొదట దీనిని కొన్ని రోజుల పాటు ప్రత్యేక రైలుగా వారానికి రెండు రోజులు మాత్రమే నడిపించి అవసరమైతే రెగ్యులరైజ్ చేసి రోజూ నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. తొలుత దీనిని ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు నడిపించడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. 

ప్రతీ సోమ, శనివారాలలో సికింద్రాబాద్‌-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నెంబర్: 06060) సికింద్రాబాద్‌లో రాత్రి 8 గంటలకు బయలుదేరి 10.13కి నల్గొండ, 11.00కి మిర్యాలగూడ, అర్దరాత్రి 12. 18కి పిడుగురాళ్ళ, 1.30కి గుంటూరు, 2.18 కి తెనాలి, ఉదయం 10.00 గంటలకు చెన్నై చేరుకొంటుంది. 

అదేవిదంగా ప్రతీ శుక్ర, శనివారాలలో చెన్నై-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నెంబర్:06059) చెన్నై నుంచి రాత్రి 7.30కు బయలుదేరి, అర్ధరాత్రి తరువాత 1.48కి తెనాలి, 2.35కు గుంటూరు, 3.38కి పిడుగురాళ్ల, తెల్లవారుజామున 4.48కి మిర్యాలగూడ, 5.33కి నల్గొండ, ఉదయం 8.25గంటలకి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది.


Related Post