ఈఎస్ఐ స్కాములో మరో ముగ్గురు అరెస్ట్

October 07, 2019


img

సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాములో నేడు ఏసీబీ అధికారులు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో వేంకటేశ్వర హెల్త్ కేర్ సంస్థ ఎండీ డాక్టర్ అరవింద్ రెడ్డి, ఈ కుంభకోణంలో భాగస్వాములుగా భావిస్తున్న కె.లిఖిత్ రెడ్డి, కె.రామిరెడ్డిలను అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ కుంభకోణంలో అరెస్ట్ అయినవారి సంఖ్య 13కు చేరింది. నిందితులు అందరూ ముఠాగా ఏర్పడి ఏడాదికి రూ. 250 కోట్లు చొప్పున గత 4 ఏళ్ళలో మొత్తం రూ.1,000 కోట్లు విలువైన మందులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. దానిలో నిందితులు ఏమేరకు స్వాహా చేశారనే విషయం విచారణలో తేలవచ్చు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు, హైదరాబాద్‌ ఈఎస్ఐ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు మొదలుపెడితే అనేకమంది పేర్లు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. Related Post