మూలవాగు బ్రిడ్జి కూలింది

September 20, 2019


img

కరీంనగర్‌ జిల్లాలో వేములవాడను, రాజన్న దేవాలయాన్ని కలుపుతూ నిర్మిస్తున్న రెండు బ్రిడ్జీలలో ఒకటి ఈరోజు ఉదయం కూలిపోయింది. అయితే ఆ సమయంలో నిర్మాణ కార్మికులెవరూ దానిపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 90 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ రెండు బ్రిడ్జీలలో ఒకటి కూలిపోవడంతో వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిరోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూలవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దాంతో బ్రిడ్జి పునాదులు దెబ్బతిని ఈరోజు ఉదయం క్రుంగిపోవడంతో బ్రిడ్జి మద్యలో విరిగిపోయింది. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, ఇంజనీర్లు అక్కడకు చేరుకొని బ్రిడ్జిని పరిశీలిస్తున్నారు.   Related Post