డ్రామాలొద్దు... చర్యలు తీసుకోండి: రేవంత్‌

September 14, 2019


img

నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో మొదలైన నిరసనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్‌, ఈ విషయం గురించి సిఎం కేసీఆర్‌తో చర్చిస్తానని ట్వీట్ చేశారు. దానిపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి వెంటనే స్పందిస్తూ, “కేటీఆర్‌గారూ...ఈ డ్రామాలు కట్టిపెట్టి యురేనియం తవ్వకాలకు మీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయండి,” అని ఘాటుగా ట్వీట్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినందునే నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలు జరుగబోతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఆ విషయం తమకు తెలియదన్నట్లు తెరాస నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే రేవంత్‌ రెడ్డి కూడా ఈవిదంగా ఘాటుగా స్పందించారు.      Related Post