నల్లమల యోధుడు వి.హనుమంతరావు

September 14, 2019


img

పచ్చటి సహజసిద్దమైన ప్రకృతికి నిలయమైన నల్లమల అడవులలో యురేనియం త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ వివిద రంగాలకు చెందిన ప్రముఖులు #సేవ్ నల్లమల పేరుతో సోషల్ మీడియాలో ఇప్పటికే పోరాటం ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా దీనిపై పోరాడేందుకు సీనియర్ నేత వి.హనుమంతరావు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 16 మంది సభ్యులు ఉండే ఈ కమిటీ ప్రజలను, ప్రతిపక్షాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి యురేనియం త్రవ్వకాలను నిలిపివేసేవరకు పోరాటాలు కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 

ఈ సందర్భంగా వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “రైతులు యూరియా కావాలని అడుగుతుంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదకరమైన యురేనియం త్రవ్వకాలకు సిద్దం అవుతుండటం చాలా బాధాకరం. యురేనియం వెలికితీసినప్పుడు వెలువడే రేడియేషన్ కారణంగా నల్లమల అడవులు, అక్కడ నివశిస్తున్న వేలాది జంతువులు, పక్షులు నశించిపోతాయి. భూమి, నీరు, గాలి కాలుష్యం అవుతాయి. దాంతో నల్లమల అడవులలో నివశించే గిరిజనులు రోగాల బారిన పడతారు. కనుక ఈ ప్రకృతి విధ్వంసానికి పాల్పడవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నల్లమల అడవులలో త్రవ్వకాలకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం త్రవ్వకాలకు గుడ్డిగా ముందుకు సాగినట్లయితే వాటిని అడ్డుకొంటాము,” అని అన్నారు.


Related Post