ఈనెల కూడా మున్సిపల్ ఎన్నికలు లేనట్లే

September 11, 2019


img

ఆగస్ట్ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం భావిస్తే, వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ల కారణంగా ఈనెల కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడటం లేదు. ఇవాళ్ళ ఆ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు ప్రభుత్వం, పిటిషనర్ల తరపు న్యాయవాదుల మద్య తీవ్ర వాదోపవాదాలు సాగాయి. రిజర్వేషన్లు, వాటి ప్రాతిపదికన వార్డుల విభజన సక్రమంగా పూర్తిచేయకుండా, హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సరికాదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించగా, వారి అభ్యంతరాలన్నిటినీ త్వరలో పరిష్కరిస్తామని కనుక ఈనెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించడానికి అనుమతించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. కానీ పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఈ కేసులను ఈనెల 26కి వాయిదా వేసింది. కనుక ఈనెలలో ఇక మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఎల్&టి సంస్థ‌ఈ‌డిని భావించవచ్చు.Related Post