అవుట్ పేషెంట్ వార్డుకు కిషన్‌రెడ్డి శంఖుస్థాపన

August 21, 2019


img

కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంతోష్ గంగ్వార్ కలిసి బుదవారం ఉదయం నగరంలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.150 కోట్లు వ్యయంతో నిర్మించబోతున్న అవుట్ పేషెంట్ బ్లాక్‌కు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే జిల్లాలలో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించడానికి కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈఎస్ఐ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోని విధంగా నిర్మించినప్పటికీ వాటికి ధీటుగా సేవలు అందించవలసిన అవసరం ఉంది,” అని అన్నారు. Related Post