భారత్‌ సైనికుల పగ చల్లారింది

August 20, 2019


img

పాక్‌ సైనికులకు చిక్కిన భారత్‌ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను చిత్రహింసలకు గురిచేసిన పాక్‌ ఆర్మీ సుబేదార్ అహ్మద్ ఖాన్ అనూహ్యంగా భారత్‌ భద్రతాదళాలు చేతిలో మూడు రోజుల క్రితం హతమయ్యాడు. పాక్‌ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూపులో సుబేదార్‌గా మూడు రోజుల క్రితం కొందరు ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు ప్రయత్నిస్తుండగా, భద్రతాదళాలు జరిపిన కాల్పులలో మరణించాడు. అభినందన్ వర్ధమాన్‌ తమకు బందీగా చిక్కాడనే విషయం భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు పాకిస్థాన్‌ అతని ఫోటోను మీడియాకు విడుదల చేసింది. ఆ ఫోటోలో అభినందన్ వర్ధమాన్ వెనుకనే పాక్‌ ఆర్మీ సుబేదార్ అహ్మద్ ఖాన్ కూడా ఉండటంతో భారత్‌ భద్రతాదళాలు దృష్టిలో కూడా పడ్డాడు. ఉగ్రవాదులతో కలిసి అతను  సరిహద్దుల వద్దకు వచ్చినప్పుడు భద్రతాదళాలు అతనిని వెంటనే గుర్తుపట్టి కాల్చేశాయి. దీంతో అభినందన్ వర్ధమాన్‌ను చిత్రహింసలు పెట్టినందుకు భారత్‌ సైనికులు ప్రతీకారం తీర్చుకొన్నట్లయింది.  Related Post