నిర్ణయం ప్రభుత్వానిది.. శిక్ష అధికారులకు!

August 20, 2019


img

అధికారులు ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తే ఏమవుతుంది?వారికి ప్రశంశలో...ప్రమోషన్లో .. అవార్డులో లభిస్తాయి కానీ ఇద్దరు అధికారులకు జైలు శిక్ష బహుమానంగా లభించింది. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, కొండపాక తహసిల్ధార్ ప్రభు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించిన హైకోర్టు వారికి రెండు నెలలు జైలు శిక్ష, చెరో రూ.2,000 జరిమానా విధించింది. 

మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేస్తున్నప్పుడు ప్రభుత్వం కొందరు రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే భూములు స్వాధీనం చేసుకుంది. దానిని సవాలు చేస్తూ ముగ్గురు రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేయగా వారికి నష్టపరిహారం చెల్లించిన తరువాత, ఈ కేసుపై తుది తీర్పు వెల్లండించే వరకు భూసేకరణ చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, కొండపాక తహసిల్ధార్ ప్రభు భూసేకరణ చేశారు. ఈవిషయాన్ని సదరు రైతులు మళ్ళీ హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు ధిక్కారణకు పాల్పడినందుకు వారిరువురికీ రెండు నెలలు జైలు శిక్ష విధించింది. అంటే ప్రభుత్వాదేశాలు పాటించినందుకు జైలు శిక్ష బహుమానంగా లభించిందన్న మాట! 


Related Post