అరుణ్ జైట్లీ పరిస్థితి విషమం

August 17, 2019


img

మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వారం రోజుల క్రితం ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. మొదట్లో కొద్దిగా కోలుకొన్నట్లు కనిపించినా తరువాత క్రమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. ఆయన కిడ్నీలు, గుండె పనితీరు మందగించడంతో ఈసీఎంఓ అనే యంత్రం ద్వారా లైఫ్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలియడంతో కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అరుణ్ జైట్లీకి అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని కానీ ఆయన పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు.     



Related Post