ఇక ఓటరు కార్డుల వంతు

August 16, 2019


img

ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లు, గ్యాస్ అకౌంట్లు, సిమ్ కార్డులు, పాన్ కార్డులు వగైరా వగైరాలన్నిటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం జరిగాయి. ఓటర్ కార్డులను కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. కేంద్ర ఎన్నికల కమీషన్ స్వయంగా ఈ ప్రతిపాదన చేసింది. కేంద్ర న్యాయశాఖకు ఈమేరకు ఒక లేఖ ద్వారా ఈ ప్రతిపాదనను పరిశీలించి అనుమతించవలసిందిగా కోరింది. ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించినట్లయితే, బోగస్ ఓటర్ కార్డులను, ఒకే వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాలలో ఓటు హక్కు కలిగి ఉండటం వంటి అవకతవకలన్నిటినీ నిరోధించవచ్చునని తెలిపింది. దీనిపై ఈసీ కేంద్ర న్యాయశాఖ అభిప్రాయం కోరింది. అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం 1950కి కొన్ని మార్పులు చేయవలసి ఉందని తెలియజేసింది.  



Related Post