కాళేశ్వరంలో కొత్తపేర్లు

August 13, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న బ్యారేజీలకు, పంప్‌హౌస్‌లకు సిఎం కేసీఆర్‌ కొత్త పేర్లు పెట్టారు. ఈమేరకు సోమవారం సిఎం కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదలయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, పోచమ్మ సాగర్‌లకు దేవతామూర్తుల పేర్లే ఉన్నందున వాటిని మార్చలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజిలు పంప్‌హౌస్‌ల కొత్త పేర్లు ఈవిధంగా ఉన్నాయి.     

• మేడిగడ్డ బ్యారేజి: లక్ష్మీ బ్యారేజి

• కన్నెపల్లి పంప్‌హౌస్‌: లక్ష్మి పంప్‌హౌస్‌

• అన్నారం బ్యారేజి: సరస్వతి బ్యారేజి

• సిరిపురం పంప్‌హౌస్‌: సరస్వతి పంప్‌హౌస్‌ 

•  సుందిళ్ళ బ్యారేజి: పార్వతి బ్యారేజి

• గోలివాడ పంప్‌హౌస్‌: పార్వతి పంప్‌హౌస్‌

• నందిమేడారం బ్యారేజి: నంది బ్యారేజి

• నంది మేడారం పంప్‌హౌస్‌: నంది పంప్‌హౌస్‌

• లక్ష్మీపురం పంప్‌హౌస్‌: గాయత్రి పంప్‌హౌస్‌


Related Post