తెలంగాణలో నేటి నుంచి పెంచిన పింఛన్ల పంపిణీ

July 20, 2019


img

తెరాస ఎన్నికల హామీలలో భాగంగా సమాజంలో వివిద వర్గాల ప్రజలకు పెంచిన పింఛన్ల ఉత్తర్వులను నేటి నుంచి తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు తమతమ నియోజకవర్గాలలో స్వయంగా పంపిణీ చేయనున్నారు. తెరాస ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, సిరిసిల్ల నియోజకవర్గంలో పెంచిన పింఛన్ల ఉత్తర్వులను లబ్దిదారులకు అందజేస్తారు. రెండు మూడు రోజులలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆ డబ్బు జమా అవుతుంది. గతంలో రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు ఉండే పింఛను ఇప్పుడు రూ.2016 నుంచి గరిష్టంగా రూ.3,016 పెంచబడింది. గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 42 లక్షల మంది ఈ ఆసరా పింఛను లబ్దిదారులు ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛనుకు వయోపరిమితిని 65 నుంచి 57 సం.లకు తగ్గించడంతో అదనంగా మరో 5-6 లక్షల మంది అర్హులవుతారని సమాచారం.



Related Post