త్వరలో సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి జనసాధారణ్ ట్రైన్

July 20, 2019


img

జంటనగరాల ప్రజలకు ముఖ్యంగా మద్యతరగతి, పేద ప్రజలకు ఒక శుభవార్త. సికింద్రాబాద్‌-తిరుపతి మద్య ఈనెల 26 నుంచి జనసాధారణ్ రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఒక్క రిజర్వ్ బోగీ కూడా ఉండదు. అన్ని జనరల్ బోగీలే ఉంటాయి కనుక వాటిలో ప్రయాణించగలమనుకున్నవారు అత్యంత తక్కువ ఛార్జీలతో తిరుపతికి వెళ్ళి రావచ్చు. ప్రస్తుతం ఈ రైలు వారానికి ఒక్కరోజు మాత్రమే నడుస్తుంది. సికింద్రాబాద్‌ నుంచి ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు (ట్రెయిన్ నెంబరు: 07202) బయలుదేరి మర్నాడు ఉదయం 6.25 గంటలకు తిరుపతి చేరుకొంటుంది. 

అదేవిధంగా తిరుపతి నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు (ట్రెయిన్ నెంబరు:07201) బయలుదేరి మర్నాడు ఉదయం 7.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకొంటుంది. ఈనెల 26, ఆగస్ట్ 2,9,16,23,30 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి, అలాగే ఈనెల 28, ఆగస్ట్ 11,18,25, సెప్టెంబర్ 1,8,15,22,29 తేదీలలో తిరుపతి నుంచి ఈ రైలు నడుస్తుంది. 


Related Post