యూపీలో పాఠశాల విద్యార్ధులకు బిజెపి సభ్యత్వం

July 19, 2019


img

ఒక్కోసారి కొందరు రాజకీయ నాయకుల అత్యుత్సాహం వారి పార్టీలకు ఊహించని తలనొప్పులు తెస్తుంటుంది. యూపీలో అటువంటి సంఘటనే జరిగింది. ఈ నెల 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా బిజెపి సభ్యత్వనమోదు కార్యక్రమం మొదలైన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా బిజెపి ఎమ్మెల్యే సుశీల్ సింగ్ బుదవారం లక్నో నగరంలోని చందౌలిలోని సయ్యద్రాజలోగల పాఠశాలకు వెళ్ళి అక్కడ 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు కాషాయకండువాలు కప్పి పార్టీ సభ్యత్వ దరఖాస్తులపై సంతకాలు చేయించుకున్నారు. ఆ తరువాత వారితో ఫోటోలు కూడా దిగారు. ఆయన స్థానికంగా చాలా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడు కావడంతో ఆయనను వారించడానికి సాహసించలేకపోయామని పాఠశాల ప్రిన్సిపల్ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్దులకు కాషాయకండువాలు కప్పి పార్టీ సభ్యత్వ ఫారాలపై సంతకాలు తీసుకొంటున్న ఆ ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాకు చేరడంతో నెటిజన్స్ అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుRelated Post