రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు

July 18, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు రెవెన్యూశాఖ తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటుకాబోతున్నాయి. 

కోరుట్ల రెవెన్యూ డివిజన్‌లో కోరుట్ల, మేడిపల్లి, కధాలాపూర్ మండలాలు ఉంటాయి. జగిత్యాల జిల్లాలో కోరుట్లతో కలిపి జగిత్యాల్, మెట్‌పల్లి మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లు అవుతాయి. 

ఇక కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్‌లో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాలు భాగంగా ఉంటాయి. నాగర్ కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్‌తో కలిపి నాగర్ కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట నాలుగు రెవెన్యూ డివిజన్లు అవుతాయి.  కొత్తగా ఏర్పాటు చేసిన ఈ రెంటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 70 రెవెన్యూ డివిజన్లవుతాయి.        Related Post