తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

July 18, 2019


img

కొన్ని బిల్లుల ఆమోదం కొరకు తెలంగాణ శాసనసభ, మండలి నేడు, రేపు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు సమావేశంలో నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 1. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, 2. రుణవిమోచన కమీషన్ ఛైర్మన్ నియామక బిల్లు, 3. పురపాలక సంఘాల పరిధిలో వార్డులను ఖరారు చేస్తూ బిల్లు, 4. ప్రభుత్వ వైద్య కళాశాలలో భోధనావైద్యుల వయోపరిమితిని పెంచే బిల్లు. నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తరువాత సభ రేపటికి వాయిదా పడింది.    



Related Post