ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం

July 15, 2019


img

మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నేత ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ గోషామహల్ నుంచి శాసనసభకు పోటీ చేశారు కానీ ఓడిపోయారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. నిన్నటి నుంచి ఆయన శరీరం వైద్యానికి స్పందించకపోవడంతో వైద్యం కూడా నిలిపివేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం.     



Related Post