తెరాస నేతను విడిచిపెట్టలేదు...చంపేశారు!

July 12, 2019


img

సోమవారం రాత్రి బేస్తకొత్తూరు గ్రామంలో కిడ్నాప్ చేయబడిన తెరాస నేత నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు విడిచిపెట్టేశారని మొదట సమాచారం వచ్చింది కానీ అతనిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసి, ఆయన మృతదేహాన్ని ఎర్రంపాడు-పుట్టపాడు మార్గంలో పడేసి వెళ్ళిపోయారు. మృతదేహంతో పక్కనే మావోయిస్టులు చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద సంతకంతో ఒకలేఖ విడిచిపెట్టి వెళ్లారు. అతను గిరిజనుల పోడు భూములను గుంజుకొంటున్నందున, పోలీస్ ఇన్ఫార్మర్ వ్యవహరిస్తున్నందున హత్యచేసినట్లు పేరుతో వ్రాసిన లేఖలో పేర్కొన్నారు. మృతదేహం పక్కనే అతని బైక్‌ను కూడా విడిచిపెట్టి వెళ్లారు. నల్లూరి శ్రీనివాసరావు చర్ల మండలంలోని పెద్దమిడిసిలేరు ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. Related Post