కేసీఆర్‌ సర్కారుపై కేంద్రం నజర్ మంచిదే: విజయశాంతి

July 11, 2019


img

బంగారి తెలంగాణ పేరుతో కేసీఆర్‌ సర్కార్ భారీగా అవినీతికి పాల్పడుతోందని భావిస్తున్న కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై నిఘా పెట్టిందన్న రాష్ట్ర బిజెపి నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. కేసీఆర్‌ సర్కార్ అవినీతికి సంబందించి ఆధారాలతో సహా ప్రతిపక్షాలు బయటపెట్టినా పట్టించుకోకుండా నిర్లక్ష్యధోరణిలో ముందుకు సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు నొక్కేస్తోందని విజయశాంతి ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ ఆవినీతిని బయటపడితే వారిపై పరువునష్టం దావా వేస్తామని సిఎం కేసీఆర్‌ బెదిరిస్తున్నారని అన్నారు. తాము ఏమి చేసినా అడిగే నాథుడు లేడనే బరితెగింపుతోనే సిఎం కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఆయనను కట్టడి చేసేరోజుకోసం తెలంగాణ ప్రజలు అందరూ ఎదురుచూస్తున్నారు.  కనుక కేంద్రప్రభుత్వం కేసీఆర్‌ సర్కారుపై కేవలం నిఘా పెట్టడంతో సరిపెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకొంటున్నారని విజయశాంతి ట్వీట్ చేశారు.     Related Post