ఖైరతాబాద్‌ గణేశ్ చిత్రం విడుదల

June 26, 2019


img

ఈ ఏడాది గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్‌లో నెలకొల్పబోతున్న గణేష్ విగ్రహం ఏవిధంగా ఉండబోతోందో తెలియజేసే చిత్రాన్ని ఉత్సవ కమిటీ మంగళవారం విడుదల చేసింది. గత ఏడాది గణేశుని విగ్రహం 56 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసినందున, ముందు అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఒక అడుగు తగ్గించి 55 అడుగుల ఎత్తు విగ్రహం చేయవలసి ఉంది. కానీ ఈసారి ద్వాదశాదిత్య రూపంలో విగ్రహాన్ని తయారుచేస్తున్నందున 61 అడుగుల ఎత్తు తప్పనిసరి అవుతోందని విగ్రహ శిల్పి రాజేంద్రన్ తెలిపారు. ఈసారి గణేష్ విగ్రహం తలపై అదనంగా మరొక తలను రూపొందించి దానిపై సూర్యభగవానుడి చక్రం మళ్ళీ దానిపై 12 తలల మహా సర్పాన్ని ఏర్పాటు చేయబోతున్నందున విగ్రహం ఎత్తు పెంచవలసి వచ్చిందని తెలిపారు. 

సూర్యుని కాంతి 12 రకాలుగా ప్రసరిస్తుంటుంది కనుక ద్వాదశాదిత్యుడు అనే పేరుంది. ఆ కిరణాలు వివిద దుష్ప్రభావాల నుంచి మానవులను కాపాడుతుంటాయి. సకల లోకాలకు వెలుగుని, శక్తిని ప్రసాదించే సూర్యుడు కూడా గణేశుని అధీనంలోనే ఉంటాడని సూచిస్తున్నట్లుగా ఈసారి  ద్వాదశాదిత్య మహాగణపతిని ప్రతిష్టించబోతున్నట్లు ఉత్సవకమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అతివృష్టి, అనావృష్టి, కరువుకాటకాలు, రోగాల బారిన పడకుండా కాపాడబడాలనే ఉద్దేశ్యంతో ఈసారి  ద్వాదశాదిత్య మహాగణపతిని ప్రతిష్టించబోతున్నట్లు తెలిపారు.


Related Post