తెలంగాణకు 1.80, ఏపీకి 2.49 లక్షల కోట్ల అప్పులు

June 26, 2019


img

రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్న అప్పుల వివరాల గురించి కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీలు, ఏంఏ ఖాన్, కెవిపి రామచంద్రరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికి రాష్ట్రంపై రూ.69,517 కోట్లు అప్పులు ఉండగా అవి 2019 మార్చి చివరి నాటికి రూ.1,80,239 కోట్లకు చేరాయని తెలిపారు.    

2014-15 ఆర్ధిక సంవత్సరంలో రూ.79,880 కోట్లు అప్పులు ఉండగా వాటికి తెలంగాణ ప్రభుత్వం రూ.5,593 కోట్లు వడ్డీ చెల్లించిందని తెలిపారు. అదేవిధంగా 2015-16 నాటికి అవి 97,992 కోట్లుకు చేరుకోగా వాటికి రూ.7,942 కోట్లు వడ్డీ చెల్లించిందని తెలిపారు. ఆ తరువాత వరుసగా 2016-17లో 1,34,738 కోట్లు (వడ్డీ 8,609 కోట్లు), 2017-18లో రూ.1,51,133 కోట్లు (వడ్డీ 11,139 కోట్లు),2018-19లో రూ.1,80,239 కోట్లు (వడ్డీ రూ.11,691 కోట్లు) చెల్లించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటితో పోలిస్తే 159 శాతం అప్పులు పెరిగాయని తెలిపారు.  

అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని మించిపోయింది. 2015 మార్చి నెలాఖరుకు రూ.1,48,743 కోట్లు ఉన్న అప్పులు 2019 మార్చి నెల ముగిసే నాటికి రూ.2,49,435 కోట్లకు పెరిగాయని తెలిపారు.

 2016-17లో 2,01,314 కోట్లు (వడ్డీ 12,292 కోట్లు), 2017-18లో రూ.2,25,234 కోట్లు (వడ్డీ 14,756కోట్లు),2018-19లో రూ.2,49,435 కోట్లు (వడ్డీ రూ.15,077 కోట్లు) చెల్లించిందని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.Related Post