వరంగల్‌ జిల్లాలు త్వరలో పునర్వ్యవస్థీకరణ?

June 25, 2019


img

మొదట 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇపుడు ములుగు, నారాయణపేట జిల్లాలతో కలిపి మొత్తం 33 జిల్లాలుగా మారింది. తాజాగా వరంగల్‌ రూరల్, అర్బన్ జిల్లాలను పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు సమాచారం. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల ప్రజల అభ్యర్ధనలు, పాలనా సౌలభ్యం కొరకు ఆ రెండు జిల్లాలను పునర్వ్యవస్థీకరించి వరంగల్, హన్మకొండ జిల్లాలుగా మార్చేందుకు సిఎం కేసీఆర్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.  

వరంగల్ రూరల్ జిల్లాను పునర్వ్యవస్థీకరించి వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని కూడా కలిపి వరంగల్ నగరం కేంద్రంగా వరంగల్ జిల్లాను, వరంగల్ అర్బన్ జిల్లాను పునర్వ్యవస్థీకరించి హన్మకొండ పట్టణం కేంద్రంగా హన్మకొండ జిల్లాగా ఏర్పాటు చేయబోతోంది. పునర్వ్యవస్థీకరణ తరువాత వరంగల్ జిల్లా కార్యాలయాలన్నీ వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబందించి గెజెట్ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.



Related Post