ఆర్బీఐ గవర్నర్‌ విరాల్ ఆచార్య రాజీనామా

June 24, 2019


img

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ విరాల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం ఇంకా ఆరు నెలల ఉండగా ముందుగానే తప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది వ్యక్తిగత కారణాలతోనే తప్పుకోవాలనుకొంటున్నట్లు విరాల్ ఆచార్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన కంటే ముందు ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించిన ఉర్జీత్ పటేల్ కూడా ఇలాగే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. అంతకు ముందు ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించిన రఘురామ రాజన్‌ చాలా అవమానకర పరిస్థితులలో పదవిలో నుంచి తప్పుకున్నారు. బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ, అప్పటి ఆర్ధికమంత్రి అరుణ్ జెట్లీ గానీ వారించలేదు. అయితే ఆయన తన పదవీకాలం ముగిసేవరకు ఉండి హుందాగా తప్పుకున్నారు. మోడీ ప్రభుత్వం ఆయన పదవీకాలం పొడిగించేందుకు సిద్దపడినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు.

మోడీ హయాంలో ఈవిధంగా వరుసగా ముగ్గురు ఆర్బీఐ గవర్నర్లు చేదు అనుభవాలు ఎదుర్కొని పదవులలో నుంచి తప్పుకోవడం గమనిస్తే ఆర్బీఐ తీవ్ర ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఆర్బీఐకి మోడీ ప్రభుత్వానికి మద్య దూరం పెరుగుతున్నట్లు అనుమానం కలుగుతోంది. దేశ ఆర్ధికవ్యవస్థకు మూలస్తంభం వంటి ఆర్బీఐలో వరుసగా ఇటువంటి అవాంఛనీయ పరిణామాలు జరుగుతుండటం చాలా ఆందోళనకరమైన విషయమే.


Related Post