రంగనాయక్ సాగర్ వద్ద హరీష్‌రావు కేక్ కటింగ్

June 21, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా కీలకపాత్ర పోషించిన మాజీ సాగునీటిశాఖ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకలలో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ వద్ద నిర్మించిన రంగనాయక్ సాగర్ వద్ద జరిగిన వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గతంలో కాంగ్రెస్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం అంటే దశాబ్ధాల పాటు సాగుండేవి కనుక జనాలు వాటి పేర్లు కూడా మరిచిపోయే పరిస్థితి నెలకొని ఉండేది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే మరో ముప్పై ఏళ్ళు గడిచినా చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టు పూర్తయ్యేది కాదేమో? కానీ సిఎం కేసీఆర్‌ కృషి, పట్టుదల, దూరదృష్టి కారణంగా ఇంతపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్ళలోనే పూర్తయి నీళ్ళు కూడా అందించడానికి సిద్దంగా ఉందిప్పుడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇంజనీరులు, అధికారులు, కార్మికులు, కాంట్రకటర్లు అందరూ రేయింబవళ్లు పోటీ పడుతూ పనిచేశారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం అనేక మంది రైతులు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వానికి ఇచ్చి సహకరించారు. వారందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాధాలు తెలుపుకొంటున్నాను. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉడతాభక్తిగా నేను పాల్గొనగలిగినందుకు చాలా గర్వంగా, సంతోషంగా భావిస్తున్నాను,” అని అన్నారు. 


Related Post