కాళేశ్వరం కోసం 2,000 మెగావాట్స్ విద్యుత్ కొనుగోలు

June 15, 2019


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈనెల 21న ప్రారంభోత్సవం కానుంది. ఈ ప్రాజెక్టు నిరంతరాయంగా కొనసాగడానికి 4,992 మెగావాట్స్ విద్యుత్ అవసరం ఉంటుందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మల్, సోలార్, హైడల్ అన్నీ కలిపి మొత్తం 16,300 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వేసవి ఉగ్రరూపం ప్రదర్శిస్తుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఒక్క వ్యవసాయ రంగానికే రోజుకు సుమారు 7800-8,000 మెగావాట్స్ విద్యుత్ అవసరం పడుతోంది. ఇక మిగిలిన దానిలో గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు పోగా సుమారు 3-3,500 మెగావాట్స్ విద్యుత్ మిగులుతున్నట్లు సమాచారం.

కనుక కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీ నుంచి 2,000 మెగావాట్స్ అదనపు విద్యుత్ కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ నెలవరకు అదనపు విద్యుత్ సరఫరా చేయాలని ఎన్టీపీసీని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు అయ్యే విద్యుత్ ఖర్చు సుమారు రూ.2,890 కోట్లు వరకు ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ఏడు జిల్లాలో ప్రజలకు త్రాగునీరు, సుమారు 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని డిజైన్ చేయబడింది. కనుక ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో పనిచేస్తే రాష్ట్రంలో నీటి కరువు శాస్వితంగా తొలగిపోతుంది.


Related Post