హైదరాబాద్‌లో యాదాద్రి కళ్యాణమండపం ప్రారంభం

June 15, 2019


img

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత శరవేగంగా యాదాద్రి ఆలయాభివృద్ధి చేస్తున్నారు. యాదాద్రితో పాటు పరిసర ప్రాంతాలు, అక్కడకు చేరుకునే మార్గాన్ని కూడా చాలా అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లో బర్కత్‌పురాలో రూ.8 కోట్లు వ్యయంతో యాదాద్రి సమాచార కేంద్రం మరియు కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఆ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొదటిసారిగా కళ్యాణమండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. పర్యాటకులు, నగరవాసులు యాదాద్రి ఆలయానికి సంబందించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడి సమాచారకేంద్రంలో తెలుసుకోవచ్చు. ఇక్కడి నుంచి యాదాద్రికి రోజూ బస్సు సర్వీసు నడిపే ప్రతిపాదన ఉంది.


Related Post