త్వరలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం

June 15, 2019


img

ఈ నెల 18వ తేదీన సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ఆ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అలాగే కొత్త సచివాలయ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, రెవెన్యూశాఖను పంచాయతీ రాజ్‌భవన్‌లో శాఖలో విలీనం ప్రతిపాదన, రెవెన్యూ, మున్సిపల్ చట్టాల సవరణలు, కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ పాలకవర్గాల ఏర్పాటు తదితర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎన్నికలలో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు దానిని అమలు చేయనందున ఈ సమావేశంలో దాని విధివిధానాల గురించి కూడా చర్చించే అవకాశం ఉండవచ్చు.   Related Post