జగన్‌కు విజ్ఞప్తి: దయచేసి మీరు రావద్దు!

June 15, 2019


img

సిఎం కేసీఆర్‌ నేడో రేపో అమరావతి వెళ్ళి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించబోతున్నారు. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క భిన్నంగా స్పందించారు. ఆయన నిన్న అసెంబ్లీ హాలులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ తెలంగాణలో 7 జిల్లాలకు త్రాగు,సాగునీరు అందించడానికి రూ.38,000 కోట్లు వ్యయంతో చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేశారు. దానితోనే 7 జిల్లాలకు నీళ్ళు అందించే అవకాశం ఉన్నప్పటికీ, సిఎం కేసీఆర్‌ ప్రాజెక్టు రీడిజైన్ పేరిట భారీగా అంచనాలు పెంచేశారు. చివరికి దాని పేరు కూడా మార్చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఇప్పుడు దాని ప్రారంభోత్సవానికి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి వస్తే, ఆనాడు తన తండ్రి చేసిన పని తప్పు కేసీఆర్‌ చేసిందే ఒప్పు అని జగన్ నోతోతోనే చెప్పించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లున్నారు. కనుక ఈ కార్యక్రమానికి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాకుండా ఉంటేనే గౌరవంగా ఉంటుంది,” అని అన్నారు. Related Post