హైదర్‌గూడాలో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్లు రెడీ

June 13, 2019


img

తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం హైదర్‌గూడాలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భవనసముదాయాలను నిర్మించింది. వాటి నిర్మాణపనులు పూర్తవడంతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ఈనెల 17న ఉదయం 6 గంటల నుండి వాటిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు సిఎం కేసీఆర్‌, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వాటిని లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తరువాత వాటిని అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయిస్తారు. 

రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనసముదాయంలో అన్ని ఆధునిక సౌకర్యాలు, వసతులు, సాంకేతిక సాధనాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశాలు నిర్వహించుకోవడానికి సమావేశమందిరాలు, క్యాంటిన్, జిమ్ సెంటర్, విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ వంటివన్నీ ఉన్నాయి. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ శిధిలావస్థకు చేరుకోవడంతో దీనిని ప్రభుత్వం నిర్మించింది. 


Related Post