ఉత్తమ్, రేవంత్‌, కోమటిరెడ్డి విజయం

May 23, 2019


img

మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేసిన రేవంత్‌ రెడ్డి తన సమీప తెరాస అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 6270 ఓట్లు తేడాతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు వారిరువురి మద్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. 

నల్గొండ నుంచి పోటీ చేసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సమీప తెరాస ప్రత్యర్ధి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై విజయం సాధించారు. 

భువనగిరి నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై విజయం సాధించారు.   

చేవెళ్ళ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 10,910 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. 

మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్ధి డికె అరుణ రెండవ స్థానానికే పరిమితమయ్యారు. ఆమె తెరాస అభ్యర్ధి మన్నే శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కరీంనగర్‌ నుంచి బిజెపి అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. 

టీఆర్‌ఎస్ అభ్యర్ధులు పసునూరి దయాకర్ (వరంగల్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పోతుగంటి రాములు (నాగర్ కర్నూల్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌) విజయం సాధించారు. 

నిజామాబాద్‌ రైతుల ఆగ్రహానికి గురైన తెరాస అభ్యర్ధి కల్వకుంట్ల కవిత రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో ఆమెకు1,40,760 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ కు 1,85,097 ఓట్లు వచ్చాయి. ఈరోజు లెక్కింపు మొదలైనప్పటి నుంచి శ్రీనివాస్ మొదటిస్థానంలో కవిత రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఒకవేళ ఆమె ఓడిపోతే ఆదివారం స్వయంకృతాపరాధామేనని భావించవలసి ఉంటుంది.


Related Post