మరికొన్ని నిమిషాలలో కౌంటింగ్

May 23, 2019


img

దేశవ్యాప్తంగా మరికొన్ని నిమిషాలలో పోలింగ్ కేంద్రాలలో కౌంటింగ్ మొదలుకానుంది. కౌంటింగ్ మొదలైన 3-4 గంటలలోనే ఏ పార్టీలు, ఏ అభ్యర్ధులు విజయం సాధించే అవకాశాలున్నాయో కొంత స్పష్టత రావచ్చు. దాంతో 41 రోజుల సుదీర్గ నీరీక్షణ, సస్పెన్స్ ముగియవచ్చు. సరిగ్గా ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ఆ తరువాత 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలుపెడతారు.

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కనుక 272 లోక్‌సభ స్థానాలను గెలుచుకొన్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది.  

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలలో మొట్టమొదటిగా మహబూబాబాద్ చివరిగా నిజామాబాద్‌ ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో తెరాస గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది కానీ ఎగ్జిట్‌ పోల్స్‌లో చెప్పినట్లుగా ఏపీలో వైసీపీ, కేంద్రంలో బిజెపి గెలుస్తాయా లేక వాటి ఆంచనాలకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? అనేది మరికొన్ని గంటలలోనే తేలిపోనుంది. 


Related Post