కాళేశ్వరం ఆలయాభివృద్ధికి 100 కోట్లు: కేసీఆర్‌

May 20, 2019


img

దశాబ్ధాలుగా నిర్లక్ష్యానికి గురైన యాదగిరిగుట్టను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత యాదాద్రిగా మార్చి ఏవిదంగా అభివృద్ధి చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో మహదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వరం (ముక్తేశ్వర స్వామి) ఆలయాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

ఆదివారం కుటుంబ సమేతంగా కాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “కాళేశ్వర ఆలయం అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తున్నాను. ఆలయాభివృద్ధి కోసం చుట్టుపక్కల 600 ఎకరాలను సేకరించవలసిందిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరులును కోరాను. పూజారులకు క్వార్టర్స్, వేదపాఠశాల, భక్తులకు కాటేజీలు, స్వాములవారి ప్రవచనాల కోసం ప్రత్యేక వేదికలు, ఇంటిగ్రేటడ్ కళాశాల వంటివన్నీ ఏర్పాటు చేస్తాము. శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారి సలహాలు, సూచనలతో ఆలయాన్ని పునర్నిర్మిస్తాము.  కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తయి స్వామివారి పాదాలను తాకుతూ నిత్యం గోదావరి నీళ్ళు ప్రవహిస్తుంటాయి. ఈ పనులన్నీ పూర్తయితే కాళేశ్వరంలో ఆధ్యాత్మిక, పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారుతుంది కనుక ఏటా లక్షలలో భక్తులు, పర్యాటకులు తరలివస్తారు,” అని చెప్పారు.


Related Post