ఈసీ సంచలన నిర్ణయం!

May 16, 2019


img

కేంద్ర ఎన్నికల కమీషన్ సంచలన రాజకీయపార్టీలకు షాక్ ఇచ్చింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోల్‌కతాలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈనెల 19నా పోలింగ్ జరుగనున్న 9 లోక్‌సభ నియోజకవర్గాలలో ఈరోజు రాత్రి 10 గంటల నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎన్నికల ప్రచారం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కానీ పశ్చిమబెంగాల్లో 67 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారం నిషేదించింది. కనుక ఆ రాష్ట్రంలో నేటితోనే చివరిదశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల కమీషన్ చరిత్రలో ఆర్టికల్ 324ను ఉపయోగించి ఎన్నికల ప్రచారం నిషేదించడం ఇదే మొదటిసారి. 

పశ్చిమ బెంగాల్ హోంశాఖ కార్యదర్శి అత్రి భట్టాచార్య ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోనందుకుగాను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈసీ తాజా నిర్ణయాలు పశ్చిమబెంగాల్లో హోరాహోరీగా పోరాడుకొంటున్న బిజెపి-తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రెంటికీ పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.


Related Post