భూపాలపల్లిలో ఆర్టీసీ బస్సు బోల్తా

May 15, 2019


img

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులున్నారు కానీ ప్రాణనష్టం జరుగకపోవడం అదృష్టమే. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో నలుగురికి కొంచెం ఎక్కువ గాయాలయినట్లు సమాచారం. ప్రయాణికులు తెలిపిన వివరాల ఓప్రకారంపెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భూపాలపల్లికి వెళుతుండగా మల్హర్ మండలంలోని టీవీ నగర్ సమీపంలో బోల్తా పడింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెప్పారు. బస్సు డ్రైవరు అతివేగంతో బస్సు నడుపుతూ మద్యలో ఖైనీ/వక్కపొడి వేసుకోబోతుంటే బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే పల్లపు ప్రాంతంవైపుకు దూసుకుపోయి బోర్లాపడినట్లు బస్సులో ప్రయాణికులు చెపుతున్నారు. సమాచారం అందుకొన్న పోలీసులు, 108 అంబులెన్స్ సర్వీసులను వెంటపెట్టుకొని వచ్చి గాయపడినవారిని మహదేవ్ పూర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.      Related Post