నేడు తుది విడత పరిషత్ ఎన్నికలు

May 14, 2019


img

రాష్ట్రంలో నేడు తుది విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు  మిగిలిన ప్రాంతాలలో 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తుది విడతలో రాష్ట్రంలోని 27 జిల్లాలోని 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వీటిలో  జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది, ఎంపీటీసీలకు 5726 మంది అభ్యర్దులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నప్పటికీ భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. మొదటి విడతలో 76.80 శాతం, 2వ విడతలో 77.63 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తుది విడతలో కూడా ఇంచుమించు అదే స్థాయిలో పోలింగ్ జరుగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది కనుక అవి ముగిసిన తరువాత మే 27వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.   



Related Post