రైతు భీమా దరఖాస్తులు ఆహ్వానం

May 14, 2019


img

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భీమా పధకంలో ఇప్పటికే 5 లక్షలకు పైగా రైతులు తమ పేర్లను నమోదు చేయించుకొన్నారు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులకు కూడా అవకాశం కల్పించవలసి ఉంది కనుక రాష్ట్ర వ్యవసాయ శాఖ అర్హులైన రైతుల నుంచి రైతు భీమా పధకం కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన 18 నుంచి 59 సం.లలోపు వయసున్న రైతులు దీనికి అర్హులు. వారు తక్షణమే తమ భూముల పట్టాపాస్ పుస్తకం లేదా ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా కాపీలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ కోరింది. దరఖాస్తులో తప్పనిసరిగా నామినీ పేరును వారి పూర్తి వివరాలను పేర్కొనాలని సూచించింది. రైతుభీమా పధకం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరంలేదని తెలిపింది. స్థానిక పంచయతీ కార్యాలయాలు లేదా మండల కార్యాలయాలలో దరఖాస్తులు సమర్పించవచ్చునని తెలిపింది. భీమా చేయించుకొన్న రైతులు ఏ కారణం చేత చనిపోయినా వారి కుటుంబానికి జీవిత భీమా సంస్థ రూ.5 లక్షలు భీమా సొమ్మును 5-7 రోజులలోపు అందిస్తుంది.  Related Post