హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.ఎస్.చౌహన్

May 13, 2019


img

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్‌ను నియమించాలాని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టులోనే తాకాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. 

జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్‌1980లో అమెరికాలో ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తరువాత డిల్లీ తిరిగి వచ్చి డిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 2005లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది బదిలీపై తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. అప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ రాధాకృష్ణన్ కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అవడంతో జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్‌ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆమోదముద్ర వేయగానే ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు చేపడుతారు.  


Related Post