హైదరాబాద్‌ మెట్రోలో అంతరాయం

April 20, 2019


img

సుమారు ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన హైదరాబాద్‌ మెట్రో రైల్ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా సేవలు అందిస్తున్నాయి. కానీ శనివారం ఉదయం మియాపూర్-ఎల్బీ నగర్ మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థలో చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ ఒక్క మార్గంలో సుమారు అర్దగంటసేపు మెట్రో సేవలు  నిలిచిపోయాయి. దీంతో మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్దులు తదితరులు ఇబ్బందిపడ్డారు. మెట్రో ఇంజనీర్లు 20 నిమిషాలలోనే ఈ సమస్యను పరిష్కరించడంతో మళ్ళీ మెట్రో రైళ్లు యధాప్రకారం నడుస్తున్నాయి. Related Post