యూపీలో పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్‌ప్రెస్‌

April 20, 2019


img

ప్రయాగరాజ్ (అలహాబాద్) నుంచి న్యూ డిల్లీ వెళుతున్న హౌరా-న్యూడిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అర్దరాత్రి యూపీలోని కాన్పూర్ స్టేషన్ కు సుమారు 23 కిమీ దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పాంట్రీ కారు (వంటశాల)తో సహా మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకొన్న జిల్లా పోలీసులు, రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అక్కడకు చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్ట్రం జరుగలేదు కానీ రైల్వే ట్రాకులు, బోగీలు బాగా దెబ్బ తిన్నాయి. రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకొని పట్టాలపై అడ్డుగా పడి ఉన్న బోగీలను క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించి మళ్ళీ పట్టాలను సరిచేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్ళవలసిన 11 రైళ్లను రద్దు చేశారు. 

Related Post