ఇంటర్ ఫలితాలు... ఎందుకిలా?

April 18, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రదమ, ద్వితీయలు కలిపి రాష్ట్రంలో మొత్తం 9,42,719 మంది విద్యార్దులు  పరీక్షలు వ్రాయగా వారిలో ఏకంగా 4 లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్ అవడం గమనిస్తే ఇంటర్మీడియేట్ స్థాయిలో విద్యాప్రమాణాలు ఎంతగా   దిగజారిపోయాయో, విద్యార్ధులకు చదువులపై ఆసక్తి ఎంతగా తగ్గిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. 

ఎందుకిలా? 

కార్పొరేట్ కాలేజీలకు డబ్బు, ర్యాంకుల యావ తప్ప విద్యార్ధుల భావి జీవితాలకు బలమైన పునాది వేద్దామనే ఆలోచన ఉండదు. ఆ కారణంగా విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. 

ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీలంటే సమస్యలకు నిలయాలుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ కాలేజీలలో చదువుకొనే విద్యార్ధులలో చాలామంది పేద, దిగువ మద్యతరగతి విద్యార్దులే ఉంటారు కనుక వారిలో చాలామంది అర్ధాకలితో లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చదువుకొనేవారే ఎక్కువగా ఉంటారు. విద్యార్ధులు చదువులలో వెనుకబడటానికి ఇవి కొన్ని కారణాలైతే, సెల్ ఫోన్స్, స్నేహాలు,  ప్రేమలు, సినిమాల ప్రభావం విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తున్నాయని చెప్పక తప్పదు. భావి జీవితానికి బలమైన పునాది వేసుకోవలసిన ఈ సమయంలో ప్రేమలు, స్నేహాలు, సెల్ ఫోన్స్ కారణంగా జీవితాలు నాశనం అవుతుండటం చాలా బాధాకరమే. ఈ స్థాయిలో వివిద కారణాలతో విద్యార్ధులు చదువులలో వెనుకబడిపోవడం సమాజానికి ప్రమాదఘంటికలు మ్రోగినట్లే! కనుక ప్రభుత్వం, కాలేజీలు, లెక్చరర్లు, తల్లితండ్రులు అందరూ కూడా విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద పెట్టడం మంచిది.        

ఇంటర్ తరువాత ఏమి చేయాలి? 

ఇంటర్మీడియెట్ ద్వితీయ సం.పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి కనుక తరువాత ఏమి చేయాలనే ప్రశ్న వినబడుతుంది. దురదృష్టవశాత్తు మన దేశంలో ఈ దశలో విద్యార్ధులలోని ప్రతిభను, తల్లితండ్రుల ఆర్ధికశక్తిని గుర్తించి విద్యార్ధులకు సరైన కోర్సు ఎంపిక చేసుకోవడంలో సహాయపడే కౌన్సిలింగ్ సంస్థలు లేవు. కనుక విద్యార్ధులు తమ స్నేహితులు ఏదో కోర్సులో చేరారనో లేదా వారి తల్లితండ్రులు, బందువులు ఇచ్చిన సలహాలు, సూచనలతో ఏదో ఒక కోర్సులో చేరిపోతుంటారు. అనేక వ్యయప్రయాసలకోర్చి ఇష్టం ఉన్నా లేకపోయినా అదే మార్గంలో ముందుకు వెళుతుంటారు విద్యార్దులు. 

సరైన కోర్సు ఎంచుకోకపోతే ఏమి జరుగుతుంది? 

కొంతమంది విద్యార్ధులు పట్టుదలగా ప్రయత్నించి ఉన్నతశిఖరాలకు చేరుకొంటారు. మిగిలినవారు ఏదో మొక్కుబడి చదువులతో ముగిస్తారు. కనుక ఈ దశలోనే విద్యార్ధులకు వారి తల్లితండ్రులు, గురువులు సహాయం చాలా అవసరం. విద్యార్డుల తల్లి తండ్రుల ఆర్ధికశక్తిని బట్టి, పిల్లల తెలివితేటలు, వారి ప్రతిభ, అభిరుచిని బట్టి సరైన కోర్సులను ఎంపిక చేసుకోవడంలో వారికి సహకరించాలి. లేకుంటే చదువులు పూర్తయ్యాక ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగాలలో చేరి మిగిలిన 75 ఏళ్ళ జీవితాన్ని భారంగా గడపవలసి వస్తుందని మరిచిపోకూడదు. 

ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్దులకు అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రింద పేర్కొన్న వాటిలో మీకు తగిన కోర్సులను ఎంపిక చేసుకొని చేరడం మంచిది.



Related Post